English | Telugu
ఆ బ్రాండ్లతోనే ఆరోగ్య సమస్యలంటున్న చంద్రబాబు!
Updated : May 5, 2020
మద్యం దుకాణాలు వద్దని కొన్ని చోట్ల మహిళలు ఆందోళన చేస్తున్నారు. మద్యం వల్ల హింసాత్మక చర్యలు పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల హత్యలు, ఆత్మహత్యలు జరిగాయి. మీ నిర్ణయం వల్ల ఆరుగురు చనిపోయారు. రాష్ట్రంలో కరోనాను ఎలా కట్టడి చేస్తారో చెప్పాలి’’ అని చంద్రబాబు డిమాండ్ చేశారు.
మద్యం వల్ల హింసాత్మక చర్యలు పెరుగుతున్నాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..దక్షిణాదిలో ఎక్కడా మద్యం దుకాణాలు తెరవకపోయినా ఏపీలో మాత్రం విచ్చలవిడిగా మద్యం దుకాణాలు ఓపెన్ చేశారని విమర్శించారు. మద్యం దుకాణాలను పోలీసులతో నియంత్రిస్తారా?.. చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులను మద్యం దుకాణాల వద్ద పెడతారా అని ప్రశ్నించారు.