English | Telugu
చంద్రబాబు మారాడు... 10 నిమిషాల్లోనే జై తెలుగుదేశం అంటున్నారు
Updated : Nov 20, 2019
టిడిపి అధినేత చంద్రబాబు ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఎన్నికల్లో ఓటమిపై రెండు రోజులుగా సమీక్షలు జరుపుతున్నారు. నియోజకవర్గంల్లో పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. జిల్లాలో పార్టీ పరిస్థితి ఏంటి అనేది తెలుసుకుంటున్నారు. పనిలో పనిగా తెలుగుదేశం పార్టీలో ఎవరు ఉంటారు.. ఎవరు పోతారో అనే విషయం పై కూడా చంద్రబాబు ఫోకస్ పెట్టారు. సమీక్షలో భాగంగా చంద్రబాబు ఈ ఆపరేషన్ కూడా నిర్వహిస్తున్నారు. ఇటీవల పార్టీకి గన్నవరం ఎమ్మెల్యే వంశీ, టీడీపీ నేత దేవినేని అవినాష్ గుడ్ బై చెప్పారు. దీంతో పార్టీకి ఏ నేతలు దూరంగా ఉంటున్నారు అనే వివరాలను చంద్రబాబు సేకరిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు రోజుల సమీక్ష సమావేశాల్లో కూడా చంద్రబాబు ఈ విషయం పై ఫోకస్ పెట్టారు.
జిల్లాలో 15 అసెంబ్లీ సీట్లలో టిడిపి కేవలం 2 సీట్లు మాత్రమే గెలిచింది. 13 సీట్లు కోల్పోయింది. ఇక్కడ పార్టీని స్ట్రాంగ్ చేసే పనిలో చంద్రబాబు ఉన్నారు. ఇక్కడ నాయకత్వం యాక్టివ్ గా ఉందా లేదా అనే విషయాన్ని ఆయన పరిశీలిస్తున్నారు. మరోవైపు సమీక్ష సమావేశాల్లో చంద్రబాబును చూసిన కార్యకర్తలు ఇప్పుడు ఓ విషయంలో తెగ సంబరపడిపోతున్నారు. ఇంతకు ముందు చంద్రబాబు మీటింగ్ అంటేనే కార్యకర్తలు భయపడిపోయేవారు. సమీక్షల పేరిట ఆయన గంటలు గంటలు జరిపేవారు. మైకు అందుకుంటే గంటన్నరకు పైగా మాట్లాడేవారు. దీంతో చెప్పిందే చెప్పి చంద్రబాబు విసిగించేవారని కార్యకర్తలు విసిగిపోయారు. అయితే ఇపుడు చంద్రబాబు సమీక్షలు జరుపుతున్న తీరు చూసిన నేతలు కార్యకర్తలు మాత్రం కొత్త విషయం చెబుతున్నారు. చంద్రబాబు మారారు గంటలు గంటలు మాట్లాడలేదు. కేవలం 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే పరిమితమవుతున్నారు. ఏదైనా విషయం సూటిగా సుత్తి లేకుండా చెప్తున్నారు. దీంతో మీటింగ్ అంటే భయపడే పరిస్థితి పోయిందని కార్యకర్తలంటున్నారు. మొత్తానికి చంద్రబాబు మారరని కార్యకర్తలూ స్టాంప్ వేశారు. ఇక నేతలు ఏం చెబుతారో చూడాలి.