English | Telugu

బిగ్ బ్రేకింగ్.. ఆర్మీని దింపిన కేసీఆర్.. రేపటి నుండి డబుల్ కోటింగ్!

తెలంగాణలో లాక్ డౌన్ అయినా సరే ప్రజలు రోడ్ల మీదకు వస్తూనే ఉన్నారు. పోలీసులు లాఠీలతో విరుచుకు పడుతున్నా.. చాలామంది రోడ్లపై చక్కర్లు కొడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రోడ్ల మీదకు వస్తున్న ప్రజలను కట్టడి చేసేందుకు కేంద్ర బలగాలను రంగంలోకి దింపింది.

ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, పోలీసుల సూచనలను పాటించాలని చెప్పిన సీఎం కేసీఆర్.. ఒకవేళ ప్రజలు మాట వినకపోతే అర్మీని దింపుతామని ముందే చెప్పారు. పరిస్థితి చేయి దాటి పోతుండటంతో అన్నట్టుగానే కేంద్ర బలగాలను రంగంలోకి దింపారు. తెలంగాణ సర్కార్ కేంద్రాన్ని విజ్ఞప్తి చేయడంతో.. కేంద్రం స్పందించి వెంటనే కేంద్ర బలగాలను పంపింది. కేంద్ర బ‌ల‌గాలు ఇప్పటికే రాష్ట్రానికి చేరుకున్నాయి. శ‌నివారం నుండి గ‌ల్లీల్లో కేంద్ర బ‌ల‌గాలు గ‌స్తీ కాయ‌బోతున్నాయి.