English | Telugu

బాబు బిజీబిజీ.. ఆ ఐదు రోజులూ నో అప్పాయింట్ మెంట్స్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.. నిత్యం ప్రజలతో మమేకమౌతూ, ప్రజా సమస్యలన తెలుసుకుంటూనే.. అధికారిక కార్యక్రమాలలో కూడా షెడ్యూల్ ప్రకారం పంక్చువల్ గా హాజరౌతై ఉంటారు. అలాగే పార్టీ వ్యవహారాలకూ సమయం కేటాయిస్తారు. వీటన్నిటినీ ఉటంకిస్తూ.. టైమ్ మేనేజ్ మెంట్ లో ఆయనను కొట్టే వారే లేరని అధికారులే కాదు.. పార్టీ శ్రేణులు కూడా చెబుతుంటాయి.

అలాంటిది ఈ వారంలో ఓ ఐదు రోజుల పాటు చంద్రబాబు యమా బిజీగా గడపబోతున్నారు. ఎటువంటి అప్పాయింట్ మెంట్లూ ఇవ్వరు. వ్యక్తిగత సమావేశాలకు అసలే అవకాశం లేదు. విశాఖ, అమరావతి, తిరుమల, బాపట్ల, బెజవాడలలో వరుస కార్యక్రమాలలో పాల్గొనేలా ఆయన షెడ్యూల్ ఉంది. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా దాదాపు ఐదు రోజుల పాటు ఆయన అప్పాయింట్ మెంట్ ఎవరికీ దొరకదు. ఇంతకీ విషయమేంటంటే.. మంగళవారం (సెప్టెంబర్ 22) నుంచీ రెండు రోజుల పాటు ఆయన విశాఖలో ఉంటారు. విశాఖలో జరిగే గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొని దేశ, విదేశవీ పెట్టుబడి దారులతో చర్చిస్తారు. రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను వారికి వివరిస్తారు.

ఇక సెప్టెంబర్ 24న అమరావతి వచ్చి అదే రోజు సాయంత్రం అదే రోజు సాయంత్రం ఆయన తిరుమలలో ఉంటారు. తరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా వేంకటేశ్వరస్వామికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఇక ఈ నెల 26న ఆయన సూర్యలంకలో బీచ్ ఫఎస్టివల్ ను ప్రారంభిస్తారు. ఆ తరువాత 29వ తేదీన బెజవాడ కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు.