English | Telugu
నదిలో పడిన పెళ్లి బస్సు.. 24మంది మృతి
Updated : Feb 26, 2020
రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బూండీ జిల్లాలోని కోటలాల్‌సోట్ దగ్గర పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి మేజ్ నదిలో పడింది. ఈ ప్రమాదంలో 24 మంది మృతి చెందారు. పోలీసుల సమాచారం మేరకు.. బూండీలోని కోటకు చెందిన వరుడి కుటుంబ సభ్యులు 40 మంది ఒకే బస్సులో సవాయ్‌మాదోపూర్‌లో జరగనున్న పెళ్లి మండపానికి బయలుదేరారు. వేగంగా వెళ్తున్న బస్సు లకేరీ పట్టణం పరిధిలోని వంతెన వద్ద అదుపుతప్పి నదిలో పడిపోయింది. స్థానికులు హుటాహుటిన అక్కడకు చేరుకుని ప్రయాణికులను రక్షించే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే 24 మంది చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.