English | Telugu
మూడవ ప్లాన్ అమలు చేస్తుండగా ఆగిపోయిన బోటు వెలికితీత పనులు...
Updated : Oct 3, 2019
ఆపరేషన్ రాయల్ వశిష్ట కొనసాగుతుంది, ప్లాన్ ఒకటి, రెండు విఫలం కావడంతో మూడవ ప్లాన్ ను అమలు చేస్తున్నారు. నదిలో ఇసుకలో కూరుకుపోయిన బోటును వెలికి తీసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. గోదావరిలో దాదాపు రెండు వందల అడుగుల లోతులో మునిగి పోయిన బోటును బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే తాజాగా కచ్చులూరు ప్రాంతంలో భారీ వర్షం కురుస్తుండటంతో మూడో రోజు కూడా ఆపరేషన్ వశిష్ట కు ఆటంకం ఏర్పడింది.
ఉదయం నుంచి సత్యం బృందం బోటు వెలికితీత పనుల్లో నిమగ్నమయ్యారు. రెండు చిన్న బోట్లతో ప్రమాదం జరిగిన స్థలంలో లంగర్లతో బోటు ఎక్కడుందనే గాలింపు చర్యలు చేపట్టారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవటంతో గాలింపు చర్యలు వాయిదా పడ్డాయి. మూడవ ప్లాన్ అమలు చేస్తుండగా భారీగా వర్షం రావడంతో నదిలో సుడులు ఎక్కువై కరెంటు రావడంతో పనులకు అంతరాయం ఏర్పడింది. ఉదయం నుంచి మద్యాహ్నం వరకు గాలింపు చర్యలు చేపట్టారు.
ఎంతసేపటికీ బోటు దొరకకపోగా మధ్యలో వర్షం రావడంతో మూడవ ప్లాన్ అమలు చేయకముందే ఆగిపోయింది. రేపు వాతవరణ పరిస్థితులను బట్టి మరియు కలెక్టర్ అనుమతితో బోటుని వెలికి తీయడం ఆధారపడి ఉంది. నిన్న జరిపిన బోటు వెలికితీత పనుల్లో లంగర్ బోటుకి పట్టి విరిగిపోయిందనీ, మరల రోప్ వేసినా లాభం లేదని చిన్న చిన్న లంగర్లతో బోటు ఎక్కడుందో కనిపెట్టి ఆ తరువాత పెద్దది వేస్తే బోటు భయటకి తీసే మార్గం ఏదైనా ఉంటుందని సత్యం బృందం తెలిపారు.