English | Telugu
మాస్క్ అవసరం లేదంటూ కరోనా కు వెల్కమ్ చెప్పిన బ్రెజిల్ అధ్యక్షుడు
Updated : Jul 8, 2020
తాజాగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో కరోనా బారిన పడ్డారు. లేటెస్ట్ గా చేయించుకున్న పరీక్షల్లో ఆయనకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ ఐంది. అంతకు ముందు ఆయన రెండుసార్లు కరోనా పరీక్షలు చేయించుకున్నా నెగటివ్ అని తేలింది. ఐతే మూడవసారి మాత్రం పాజిటివ్ అని తేలింది. ఇక కరోనా టెస్టుల గురించి, మాస్కు ధరించడం గురించి ఈయన చుట్టూ పెద్ద కాంట్రవర్సీనే నడుస్తోంది. ఎంత దేశాధినేతైనా సరే మాస్క్ ధరించాల్సిందేనన్న బ్రెజిల్ కోర్టు వ్యాఖ్యలను ఆయన కొట్టి పారేశారు. అంతే కాకుండా కరోనా టెస్టు లు తరుచూ చేయించుకోవడం వల్ల తన ఊపిరితిత్తులు శుభ్రపడుతున్నాయని గొప్ప కామెంట్ ఒకటి చేశారు. ఒక పక్క కరోనా బ్రెజిల్ లో తీవ్రంగా స్ప్రెడ్ అవుతుంటే ర్యాలీలు నిర్వహించిన మహానుభావుడు ఈ బోల్సోనారో. అయితే బోల్సోనారో తీరుపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇదే విషయమై బ్రెజిల్‌లోని సావోపాలో గవర్నర్ జాయ్ డోరియా మాట్లాడుతూ బ్రెజిల్‌లో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నా అధ్యక్షుడికి ఏమాత్రం పట్టడం లేదని, దేశంలో ఇపుడు కరోనా కంటే బోల్సనారో వైరస్ అత్యంత ప్రమాదకరం అంటూ తీవ్ర విమర్శలు చేశారు.