English | Telugu
త్రిసభ్య కమిటీ ఏమననుంది?.. కుళ్ళిపోతున్న దిశ నిందితుల మృతదేహాలు
Updated : Dec 17, 2019
దిశ ఎన్ కౌంటర్ కేసులో హతులైన నలుగురు యువకుల మృతదేహాలు గాంధీ ఆస్పత్రి లోని మార్చురీలో కుళ్లిపోతున్నాయి. దీంతో వాటిని ఎలా భద్రపర్చాలనే అంశంపై ఆసుపత్రి వర్గాలు మల్లగుల్లాలు పడ్డాయి. డిసెంబర్ 13వ తేదీ వరకు మృతదేహాలను భద్రపరచాలని మొదట హై కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత తదుపరి ఉత్తర్వులు రాకపోవడంతో ఏం చేయాలనే దానిపై ఆసుపత్రి వర్గాలు ఆలోచిస్తున్నాయి. మృతదేహాలకు ఎంబామింగ్ చేస్తే మరి కొంత కాలం వాటిని భద్రపర్చే అవకాశముంది. ఎంబామింగ్ అంటే మృతదేహం లోని రక్తనాళాల్లో ఉన్న రక్తంతో పాటు ఇతర ద్రవపదార్థాలు అన్నిటినీ తీసేసి వాటిలోకీ ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నారు. అయితే ఎన్ కౌంటర్ కారణంగా శరీరాలకు బులెట్ గాయాలు ఉండటంతో ఫ్లూయిడ్స్ లీకయ్యే అవకాశం ఉంది కాబట్టి మరింత జాగ్రత్తగా ఎంబామింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే కోర్టు ఆదేశాలతో ఇవన్నీ చెయ్యాల్సి ఉంటోంది. దీంతో గాంధీ ఆసుపత్రి సిబ్బంది వేగం పెంచారు. వెంటనే ఉన్నతాధికారులకు లేఖలు రాశారు. ఆపాటికే ఆలస్యం అవడంతో వెంటనే ఆదేశాలు వెలువడ్డాయి. దిశ హంతకుల మృతదేహాలకూ వెంటనే ఎంబామింగ్ చేశారు. శవాలు చెడిపోకుండా ఇంజెక్షన్ లు ఎక్కించారు. అయితే వీరి డెడ్ బాడీకి ఎక్కించిన ఒక్కో ఇంజెక్షన్ ధర ఏడున్నర వేలు వీటి సాయంతో మరో నాలుగు రోజుల పాటు మృతదేహాలనూ చెడిపోకుండా కాపాడుకోవచ్చు. ఎందుకంటే ఎంత డీప్ ఫ్రిజ్ లో పెట్టిన ఓ శవాన్ని వారం రోజుల వరకే కుళ్లిపోకుండా చూసుకోవచ్చు. మరోవైపు రెండ్రోజుల్లో సుప్రీం కోర్టు నియమించిన త్రిసభ్య కమిటీహైదరాబాద్ రానుంది. త్రిసభ్య కమిటీ ఓకే చెప్పిన తర్వాతే వీరి మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తారు. అప్పటి వరకు వీరి మృతదేహాలు ఇలా మార్చురీలో పడి ఉండాల్సిందే.