English | Telugu

కృష్ణా జిల్లాలో పేలుడు.. ఇద్దరు మృతి

ఏపీలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా కృష్ణా జిల్లాలోని గ‌న్న‌వ‌రం మండ‌లం సూరంప‌ల్లి పారిశ్రామికవాడ‌లో పేలుడు సంభ‌వించింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. పలువురికి తీవ్రగాయాలయ్యాయి.

గురువారం మధ్యాహ్నం స్థానికంగా ఉన్న ప్లైవుడ్ కంపెనీలో పేలుడు సంభ‌వించ‌డంతో తండ్రీకుమారుడు మృతి చెందారు. మృతుల‌ను విజ‌య‌వాడ రూర‌ల్ కండ్రిక వాసులుగా పోలీసులు గుర్తించారు. మృతులిద్ద‌రూ విజ‌య‌వాడ నుంచి స్క్రాప్‌ కొనేందుకు ప్లైవుడ్ కంపెనీకి వ‌చ్చారు. ప్లైవుడ్ కంపెనీలో కెమిక‌ల్ డ‌బ్బాల‌ను ఆటోలో ఎక్కిస్తుండ‌గా భారీ శ‌బ్దంతో పేలుడు సంభ‌వించింది. దీంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. సమాచారం అందిన వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు.. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.