English | Telugu

తిరుపతిలో దుబ్బాక రిజల్ట్ రిపీట్? బీజేపీకి టీడీపీ సపోర్ట్ చేసే ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణలు మారబోతున్నాయా? తిరుపతి ఉప ఎన్నిక అందుకు నాంది కాబోతుందా? జగన్ సర్కార్ పై బీజేపీ దూకుడు అందుకేనా? అంధ్రప్రదేశ్ లో తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలతో ఇవే అనుమానాలు వస్తున్నాయి. కొంత కాలంగా సైలెంట్ గా ఉన్న బీజేపీ నేతలు జగన్ సర్కార్ పై ఒక్కసారిగా ముప్పేట దాడికి దిగారు. జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలంతాఘాటు ఆరోపణలతో వైసీపీ సర్కార్ పై విరుచుకుపడుతున్నారు. దీంతో ఏపీలో బీజేపీ బలమైన స్కెచ్ వేసిందని, తిరుపతి ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోందనే చర్చ జరుగుతోంది.వైసీపీ ప్రభుత్వం ఏర్పడి 17 నెలలు కావస్తున్నా.. జగన్ పాలనపై బీజేపీ హైకమాండ్ సాఫ్ట్ వైఖరితోనే ఉంది. కన్నా లక్ష్మినారాయణ ఏపీ పార్టీ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు రాజధాని సహా పలు అంశాలపైఆయన ఘాటుగానే స్పందించేవారు. జాతీయ నేతలు మాత్రం పెద్దగా పట్టించుకునేవారు కాదు. జీవీఎల్ జగన్ కు అనుకూలంగా మాట్లాడేవానే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే సోము వీర్రాజు పార్టీ పగ్గాలువచ్చాకా ఏపీ కమలం నేతలు సైలెంట్ మూడ్ లోకి వెళ్లిపోయారు. ఏపీలో వరుసగా ప్రజా వ్యతిరేక ఘటనలు జరిగినా , తిరుపతిలో వివాదాస్పద నిర్ణయాలు జరిగినా సోము వీర్రాజు టీమ్ స్పందించలేదు. దీంతోవైసీపీకీ బీజేపీ బీ టీమ్ గా మారిందనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే తాజాగా జగన్ ప్రభుత్వంపై కమలం పార్టీ స్టాండ్ మార్చినట్లు కనిపిస్తోంది.

తెలంగాణలో గతంలో ఎప్పుడు లేనంతగా రాజకీయ కాక రేపిన దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ సంచలన విజయం సాధించింది. టీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోవడంతో జరిగిన ఉప ఎన్నికలోఅధికార పార్టీని, ఎమ్మెల్యే చనిపోయిన సెంటిమెంట్ ను అధిగమించి జయకేతనం ఎగురవేసింది కమలం పార్టీ. దుబ్బాక ఫలితం తర్వాత తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు కనిపిస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా
కమలం కేడర్ లో జోష్ కనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీ బలమైన ప్రత్యర్థిగా మారిందనే భావన వచ్చింది. దుబ్బాక తరహాలోనే త్వరలో జరగనున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో విక్టరీకొట్టి.. వైసీపీకి సవాల్ విసరాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. కరోనాతో వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు చనిపోవడంతో తిరుపతిలో ఉపఎన్నిక జరగనుంది. దీంతో తిరుపతిలోనూ దుబ్బాకతరహాలోనే అధికార పార్టీ, ఎంపీ చనిపోయిన సెంటిమెంట్ ను అధిగమించి విజయం సాధించాలని కమలం కసరత్తు చేస్తోందని తెలుస్తోంది.

తిరుపతిపై సీరియస్ గా ఫోకస్ చేసిన బీజేపీ.. అప్పుడు కార్యాచరణ కూడా ప్రారంభించింది. తిరుపతిలో కార్యకర్తల సమావేశం పెట్టారు బీజేపీ నేతలు. ఈ సమావేశంలో ఏపీ బీజేపీ వ్యవహారాలఇన్చార్జి సునీల్ దేవధర్ వైసీపీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఏపీలో సనాతన హిందూ ధర్మం ప్రమాదంలో పడిందన్నారు. అభివృద్ధి కోసం కేంద్రం నిధులిస్తే వైసీపీ నేతలు దోచుకుంటున్నారని ఆరోపించారు. తిరుపతిపార్లమెంటు స్థానం ఉప ఎన్నికల్లో విజయం సాధించి తీరుతామని సునీల్ ధీమా వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారి సంపదపై రాష్ట్ర ప్రభుత్వం కన్ను పడిందని బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆరోపించారు. సీఎం జగన్‌ప్రజాకంటక పాలన గురించి ఏడాదిన్నరలోనే ప్రజలకు తెలిసిపోయిందని బీజేపీ జాతీయ కార్యదర్శి వై.సత్యకుమార్‌ ఢిల్లీలో ఆరోపించారు. ఏపీలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయని.. పోలీసు రాజ్యంనడుస్తోందని ఆయన ధ్వజమెత్తారు.

తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో తాము గెలుస్తామని బీజేపీ నేతలు ధీమాగా ఉండటానికి బలమైన కారణాలు కూడా కనిపిస్తున్నాయి. తిరుపతి ఆధ్మాత్మిక నగరం కావడం బీజేపీకి ప్లస్ కానుంది.జనసేనతో పొత్తు ఉండటంతో కమలానికి మరింత బలంగా మారింది. ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ కూడా తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీకి సహకరించవచ్చని తెలుస్తోంది. టీడీపీ అభ్యర్థి పోటీలో ఉన్నా..
లోపాయకారిగా బీజేపీకి టీడీపీ సపోర్ట్ చేస్తారని చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసినప్పుడు.. తిరుపతిలో స్వల్ప మెజార్టీతో వైసీపీ విజయం సాధించింది. గతంలో కన్నా
ఇప్పుడు బీజేపీ, జనసేన బలపడ్డాయని, తమకు తిరుపతిలో గెలవడం పెద్ద కష్టం కాదన్నది ఏపీ కమలం నేతల మాట.

2014లో ఎన్డీఏలోనే ఉన్న టీడీపీ గత లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీతో విభేదించి బయటికి వచ్చింది. ఇటీవలే మళ్లీ బీజేపీ పెద్దలకు చంద్రబాబు మళ్లీ దగ్గరయ్యారని తెలుస్తోంది. నెల్లూరుజిల్లాకు చెందిన ఓ పారిశ్రామికవేత్త ద్వారా ప్రధాని మోడీని చంద్రబాబు ప్రసన్నం చేసుకున్నారని చెబుతున్నారు. అందుకే తిరుపతిలో బీజేపీ గెలుపు కోసం చంద్రబాబు, టీడీపీ సాయం చేయబోతున్నారనిసమాచారం. వైసీపీ ఓడిపోవడమే టీడీపీ ముఖ్యం కాబట్టి అలా చంద్రబాబు ముందుకు వెళతారనే ప్రచారం జరుగుతోంది. ప్రధాన ప్రతిపక్షంగా ఉండి అభ్యర్థిని పెట్టకపోతే బాగుండదు కాబట్టి క్యాండిడేట్ నుపెడతారని.. కాని ప్రచారం మాత్రం నామ్ కే వాస్తాగానే ఉండవచ్చని టీడీపీ నేతలు కూడా చెబుతున్నారు. కమ్యూనిస్టులు కూడా వైసీపీకి వ్యతిరేకంగానే ఉండే అవకాశం ఉంది. తిరుపతిలో కాంగ్రెస్ పోటీ చేసినా పెద్దప్రభావం ఉండదంటున్నారు బీజేపీ నేతలు.

తిరుపతి ఉప ఎన్నికలో గెలవడం ద్వారా ఏపీలో పార్టీ బలోపేతానికి కమలం సన్నాహాలు చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. తిరుపతిలో పోటీకి బలమైన అభ్యర్థిని కూడా బీజేపీ ఇప్పటికే సిద్దం
చేసినట్లు చెబుతున్నారు. వైసీపీ సర్కార్ వైఫల్యాలపై ఇంతకాలం ఎక్కువగా ఫోకస్ చేయని బీజేపీ.. ఇకపై తీవ్ర స్థాయిలో టార్గెట్ చేయవచ్చని తెలుస్తోంది. హైకమాండ్ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ఇచ్చిందంటున్నారు. ఢిల్లీ డైరెక్షన్స్ వచ్చాయి కాబట్టే ఎప్పుడూ వైసీపీపై పెద్దగా మాట్లాడని సోము వీర్రాజు కూడా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నారు. మొత్తంగా తిరుపతి ఉప ఎన్నికతో ఏపీలోరాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు.