English | Telugu

జగన్ వ్యతిరేకులందరూ ఏకమయ్యారు.. ఇంటలిజెన్స్ ఏమి చేస్తున్నట్టు... 

* ఎన్నికల కమిషన్ నిర్ణయం జగన్ కు తలనొప్పి వ్యవహారమే
* లీగల్ పాయింట్స్ తో ఏకగ్రీవాలను సైతం ఛాలెంజ్ చేయటానికి రెడీ రెడీ అయిన తెలుగుదేశం
* ఇప్పటికే వై ఎస్ ఆర్ సి పి పై కత్తులు నూరుతున్న కన్నా
* జన సేన తడాఖా ఏమిటో ఇప్పుడు చూడండంటున్న పవన్ కళ్యాణ్

ఎవరివల్ల చెడ్డావోయి వీరన్నా అంటే, నోటి వల్ల చెడ్డానోయి కాటంరాజా అన్నాడుట వెనుకటికో పెద్దమనిషి. అలా తయారైంది రాష్ట్రం లో అధికార వై ఎస్ ఆర్ సి పి పరిస్థితి. రికార్డు వ్యవధిలో స్థానిక ఎన్నికలు నిర్వహించి పేరు తెచ్చుకుందామని తహ తహ లాడిన జగన్ మోహన్ రెడ్డి పార్టీని, తెలుగుదేశం , జనసేన, బీ జె పీ రాష్ట్ర నాయకత్వాలు ఎవరి స్థాయిలో వారు గవర్నర్కు, కేంద్రానికి ఫిర్యాదులు చేయటం ద్వారా వై ఎస్ ఆర్ సి పి దూకుడు ని అడ్డుకున్నారు. నిజానికి కన్నా లక్ష్మీ నారాయణ చేసిన హోమ్ వర్క్ మామూలుది కాదు. ఈ విషయం లో...తన భూములకె దిక్కు లేని ఈ రాష్ట్రం లో జగన్ పాలన ను అలా చూస్తూ ఊరుకుంటే, రాష్ట్రమంతా కబ్జా మయమైపోతుందంటూ ఆయన చేసిన ఫిర్యాదుకు, బీ జె పి కేంద్ర నాయకత్వం చాలా తీవ్రంగా స్పందించింది. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించడంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకుల వ్యూహాలు ఫలించినట్టే.

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైసీపీ నాయకులు తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారంటూ బీజేపీ రాజ్యసభ సభ్యులు కేంద్రానికి నివేదించిన రెండు రోజుల్లోనే వాయిదా పడటం చర్చనీయాంశంగా మారింది. ఇదంతా కూడా , వై ఎస్ ఆర్ సి పి అధినేత నిజానికి దూకుడు గా వెళ్లడం వల్ల , కొని తెచ్చిపెట్టుకున్న సమస్య. అయితే, పదే పదే ఇలాంటి తప్పుల్లో జగన్ మోహన్ రెడ్డి ఎలా కాలు వే స్తున్నారనే అంశం లో -జగన్ క్యాంప్ లో ఇప్పటికీ క్లారిటీ రాకపోవటమే అసలైన విషాదం. అటు తన దూకుడు వైఖరి తో పాటు, ఇంటెలిజెన్స్ వ్యవస్థ లో డొల్ల తనం కూడా జగన్ మోహన్ రెడ్డి నిర్ణయాలు ప్రజల్లోకి వెళ్లకుండానే, సగం లో ఆగిపోయే పరిస్థితి వస్తోంది. ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే, ఏ బీ వెంకటేశ్వర రావు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్న సమయం లో ప్రతిపక్షం ఎత్తుగడలు పసికట్టడం- చంద్రబాబు నాయుడుకు చాలా సులభతరమైన టాస్క్ అయ్యేది. వాస్తవానికి స్టీఫెన్ రవీంద్ర ఇంటెలిజెన్స్ చీఫ్ గావచ్చి ఉండి ఉంటె, జగన్ మోహన్ రెడ్డి కి ఇలాంటి విషయాల్లో కొంత బ్రీతింగ్ స్పేస్ దొరికేది. కనీసం కౌంటర్ స్ట్రాటజీస్ తో ఎలా వెళ్లాలనే అంశం లో స్టీఫెన్ లాంటి అనుభవజ్ఞుడు సలహాలు ఇచ్చే అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ప్రతి అంశం లోనూ , ప్రత్యేకించి రాజకీయంగా ముందస్తుగా పరిణామాలు ఊహించే , పసికట్టే అంశాల్లో ఇంటెలిజెన్స్ వ్యవస్థ గాఢ నిద్ర పోతుండటం వల్లనే ఇలాంటి షాకింగ్ డెవెలెప్మెంట్స్ చోటు చేసుకుంటున్నాయని వై ఎస్ ఆర్ సి పి నాయకులు వాపోతున్నారు.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్‌ను కేంద్ర ప్రభుత్వం అదును చూసి దెబ్బకొట్టిందా? స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించడంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకుల వ్యూహాలు ఫలించాయా?- ప్రస్తుతం రాష్ట్రంలో వినిపిస్తోన్న ప్రశ్నలు ఇవి. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైసీపీ నాయకులు తమ పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారంటూ బీజేపీ రాజ్యసభ సభ్యులు కేంద్రానికి నివేదించిన రెండు రోజుల్లోనే వాయిదా పడటం చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో- బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు మరో వైపు నుంచి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హింసను ప్రేరేపిస్తోందని, రాజకీయ ప్రత్యర్థులపై ప్రాణాంతక దాడులకు పాల్పడుతోందంటూ కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. చిత్తూరు జిల్లా పులిచెర్ల సమీపంలో చోటు చేసుకున్న ఉదంతాన్ని వారు ప్రధానంగా అమిత్ షా వద్ద ప్రస్తావించారు. వీడియో క్లిప్పింగులను చూపించారు. జగన్ సర్కార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుని కేంద్రం.. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అయితే, విషయం లో జగన్ మోహన్ రెడ్డి వ్యవహరించిన దూకుడు వైఖరిని కూడా, కేంద్ర ప్రభుత్వం పరిగణన లోకి తీసుకున్నట్టు సమాచారం.