English | Telugu
బాబు 5 వేలకే ఇస్తే జగన్ 20 వేలు గుంజుతున్నారు
Updated : Jun 5, 2020
జగన్ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల కోసం సేకరించే భూములలో కూడా అవినీతికి పాల్పడుతోందని మండిపడ్డారు. ఎకరం 10 లక్షలు చేసే రాజమండ్రి ఆవ భూమిని 45 లక్షలకు కొన్నారని.. ఐతే ఇదే భూమిని సాగునీటి శాఖ అధికారులు ముంపు ప్రాంతం గా గుర్తించారని ఆయన తెలిపారు. ఈ మొత్తం వ్యవహారం లో 150 కోట్ల అవినీతి జరిగిందన్నారు. చంద్రబాబు హయం లో రాత్రి పన్నెండు గంటల వరకు మద్యం అమ్మించడం ద్వారా వచ్చిన పన్ను తో పాటు తాగి బయటకు వచ్చిన వారి వద్ద నుండి మళ్ళీ ఫైన్ వసూలు చేసావారని తెలిపారు. ప్రస్తుతం పేదలకు మద్యం అందుబాటులో ఉండకూడదని కొత్త బ్రాండ్లు తెచ్చి రేట్లు పెంచినా తాగేదంతా పేదలేనని ఆయన అన్నారు. ఈ కొత్త బ్రాండ్లు కూడా వైసిపి నాయకులకు సంబంధించినవేనని అన్నారు. టీడీపీ జన్మభూమి కమిటీలు తెస్తే ఇపుడు జగన్ ప్రభుత్వం 300 కోట్ల ఖర్చుతో వాలంటీర్ల వ్యవస్థ తెచ్చిందని ఐతే ప్రతి గ్రామంలో నాటు సారా ప్రవాహం నడుస్తున్నా.. వాలంటీర్లు ఫిర్యాదు చేయడం లేదని అయన విమర్శించారు.