English | Telugu
దుబ్బాకలో దూసుకుపోతున్న బీజేపీ! హరీష్ రావు రాజీనామా చేస్తారా?
Updated : Nov 10, 2020
దుబ్బాక ఉప ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంలో పోరు హారాహోరీగా సాగింది. టీఆర్ఎస్ తరపుల అంతా తానే వ్యవహరించారు మంత్రి హరీష రావు. గతంకంటే తనకు మెజారిటీ పెరుగుతుందని చెప్పారు హరీష్ రావు. కాంగ్రెస్, బీజేపీలకు కనీసం డిపాజిట్‌లు కూడా రావని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం సీన్ రివర్స్ కనిపిస్తోంది. దుబ్బాక ఎన్నిక బాధ్యతను పూర్తిగా హరీశ్‌రావు చేపట్టినందువల్ల ఓటమి ఎదురైతే ఆయనే స్వయంగా నైతిక బాధ్యత వహించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. మంత్రిగా తనంతట తానే బాధ్యతల నుంచి తప్పుకునే అవకాశం ఉందని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు అభిప్రాయపడ్డాయి.