English | Telugu
నాలుగు సార్లు టెస్టు చేసినా నెగటివ్.. అయినా ప్రాణాలు పోయాయి
Updated : Jul 18, 2020
ఇది ఇలా ఉండగా గడచిన కొద్ది రోజులుగా కరోనా లక్షణాలతో అయన బాధపడుతున్నాడు. దీంతో మరో సారి ఆ ఏఎస్ఐ కరోనా పరీక్షలు చేయించుకోగా మళ్లీ రిజల్ట్ నెగిటివ్‌గానే వచ్చింది. మొత్తం నాలుగు సార్లు పరీక్షలు చేయించుకోగా.. నాలుగు సార్లు నెగిటివ్ ఫలితమే వచ్చింది. కానీ అయన పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు నగరంలోని పలు ఆసుపత్రులలో చేర్చే ప్రయత్నం చేశారు. కానీ కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు బెడ్ లు ఖాళీ లేవంటూ ప్రేమ్ కుమార్‌ను చేర్చుకోలేదు.
ఆయనకు అంతకు ముందు చేసిన కరోనా టెస్టులన్నింటిలో నెగిటివ్ ఫలితం రావడంతో చివరికి గాంధీ ఆస్పత్రిలోనూ చేర్చుకోలేదు. దీంతో విషయం తెలుసుకున్న కొందరు పోలీసు ఉన్నతాధికారులు చిరవ తీసుకుని జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగలిగారు. ఐతే అప్పటికే ఆ ఏఎస్ఐ పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ఇక్కడ కూడా మరోసారి కరోనా వైరస్ నిర్దారణ పరీక్ష జరపగా అక్కడ కూడా నెగిటివ్‌గా ఫలితం వచ్చింది. ఆ మరుసటి రోజుకు ప్రేమ్ కుమార్ కిడ్నీలు పూర్తిగా విఫలమయ్యాయి. దీంతో డాక్టర్లు మళ్లీ కరోనా పరీక్షలు చేశారు కానీ ఆ రిజల్ట్ వచ్చేలోపే ప్రేమ్ కుమార్ ప్రాణాలు విడిచారు. అయన మరణం తరువాత వచ్చిన టెస్ట్ ఫలితంలో మాత్రం పాజిటివ్ గా తేలింది. దీంతో ముందుగా చేయించుకున్న నాలుగు టెస్టులలో నెగిటివ్ రావడమే ఆ ఏఎస్ఐ మృతికి కారణమంటూ కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.