English | Telugu
పాతబస్తీలో కరెంట్ బిల్లులు వసూలు చేసినప్పుడే కేంద్ర నిధులు! సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Updated : Nov 21, 2020
సమాజంలో 80 శాతం ఉన్న హిందువుల మనోభావాలే బీజేపీకి ముఖ్యమన్నారు సంజయ్. భాగ్యలక్ష్మీ దేవాలయానికి వెళ్లకూడదని ఎక్కడైనా రాసి ఉందా? లేఖపై ఏ దేవాలయం దగ్గరైనా సీఎం కేసీఆర్‌తో చర్చకు సిద్దమని చెప్పారు. నిజమైన హిందువు కాదు కాబట్టి.. కేసీఆర్ మక్కా మసీదుకైనా వస్తారని భావించానన్నారు. పేదలకు అందాల్సిన రైతుబంధును పొందుతోన్న కేసీఆర్, కేటీఆర్‌లు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. మేము అధికారంలోకి వచ్చాక హైదరాబాద్‌లో ఉన్న 40 వేల మంది రోహింగ్యా ముస్లింలను తరిమికొడతామని చెప్పారు. ఓట్ల కోసమే 40 వేల మంది రోహింగ్యాలను, పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారిని కేసీఆర్ కాపాడుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు.