English | Telugu
తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్
Updated : Mar 11, 2020
తెలంగాణలో టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ అందుకు తగ్గట్లుగా బలమైన నాయకుడికి పార్టీ పగ్గాలు అప్పగించింది. ఏడెనిమిది మంది పార్టీ అధ్యక్ష పదవి కోసం ప్రయత్నించినా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు దక్కింది. ముందు నుంచీ బీజేపీకి నిబద్ధత కలిగిన నేతగా కొనసాగుతుండటం, ప్రజల్లో మంచి ఇమేజ్ ఉన్న నేత కావడం వంటి కారణాల వల్ల బండి సంజయ్‌ను భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ పదవీకాలం ముగియడంతో బండి సంజయ్‌ను నూతన అధ్యక్షుడిగా నియమితులైయ్యారు.
ఆర్ఎస్ఎస్ నేతలతో ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. కార్పొరేటర్ స్థాయి నుంచి ఆయన ఎంపీ స్థాయికి ఎదిగారు. తెలంగాణలో బలంగా ఉన్న మున్నూరు కాపు సామాజకవర్గానికి చెందిన నేత ఆయన. అన్ని కోణాల్లోనూ బండి సంజయ్ బలమైన నాయకుడని భావించిన పార్టీ ఆయనను అధ్యక్షుడిని చేసింది.
ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ మరోసారి తనకు ఛాన్స్ ఇవ్వాలని కోరారు. ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్‌తో పాటు ఇటీవల పార్టీలో చేరిన డీకే అరుణ, జితేందర్ రెడ్డి వంటి నేతలు బీజేపీ అధ్యక్ష పదవి ఇవ్వాలని అధిష్టానాన్ని కోరారు. అయితే, కొత్తగా చేరిన నేతలకు ఇప్పుడు అధ్యక్ష పదవి అప్పగించడం సరికాదని అధిష్ఠానం భావించింది. ముందునుంచీ పార్టీలో కొనసాగిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు రాష్ట్ర బీజేపీ పగ్గాల అప్పగించింది. కేవలం కరీంనగర్ జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా అన్ని ప్రాంతాల్లో యువతలో సంజయ్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది.
పైగా చాలారోజులుగా బీజేపీలో కొనసాగుతున్న ఆయనకు పార్టీ సిద్ధాంతాలు, కట్టుబాట్లు బాగా తెలుసు. బండి సంజయ్ సామాజకవర్గం తెలంగాణలో ప్రధానమైనది. ఇది కూడా ఆయనకు కలిసివచ్చింది.