English | Telugu
కరోనా కోరల్లో బాల్యం చిక్కకుండా
Updated : Aug 3, 2020
లాక్ డౌన్ ఎత్తి వేసిన అనంత రం బాలకార్మిక వ్యవస్థ బలోపేతం కావడంతో పాటు పిల్లల అక్రమరవాణా పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమైంది. లైంగిక దోపిడి కోసం పిల్లల అక్ర మరవాణా పెరిగే ప్రమాదం ఉందని ఈ సంస్థ పేర్కొంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఒకే తీరుగా లే దు. ఆయా రాష్ట్రాల పరిస్థితులు, మౌలికసదుపాయాలు, ప్రభుత్వ అవగాహన కార్యక్రమాలను బట్టి కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా ఈ సమస్య ఉంది. కరోనా కారణంగా ఆయా రాష్ట్రాల్లో బాలల అక్రమ రవాణా పెరిగే అవకాశాలున్నాయి. కార్మిక చట్టాలు దుర్వినియోగం అయ్యే ప్రమా దం కూడా ఉందని ఈ నివేదికలో ఆందోళన వ్యక్తం చేశా రు.
ఈ పరిస్థితి అరికట్టాలంటే గ్రామస్థాయిలో ఎక్కుగా నిఘావ్యవస్థ పెంచాలని, చట్టా న్ని అమలు చేసే సంస్థలు అప్రమత్తంగా ఉండాలని సామాజిక కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. లాక్ డౌన్ అనంతరం బాల్యవివాహాలు కూడా పెరిగే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితులను చక్కదిద్ది బాల్యాన్ని పరిశ్రమల్లో బందీ కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే అన్నారు. గ్రామస్థాయిలో నిఘావ్యవస్థ రూపొందించి చట్టాలను బలోపేతం చేయా ల్సిన అవసరం ఉందని కైలాష్ సత్యార్థి చిల్డ్రన్ ఫౌండేషన్ అభిప్రాయ పడింది. గ్రామస్థాయిలో గ్రామ పంచాయి తీలు పిల్లలను పనుల్లోకి వెళ్లకుండా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అలాగే మండల స్థాయి అధికారులు, జిల్లా స్థాయి అధికారులు తమవంతు కృషి చేస్తూ బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు కృషి చేయాలన్నారు. వ్యాపార కార్యకలాపాలు, వస్తువుల తయారీ కంపెనీల్లో బాలకార్మికులు పనులు చేయకుండా చూడాల్సిన బాధ్య తస్థానిక అధికారులతో పాటు పౌరులపై కూడా ఉంది. స్వచ్ఛంద సంస్థల కృషితో రక్షిం చబడిన పిల్లలను వారి వయోపరిమితుల ఆధారంగా విద్యారంగం వైపు మళ్లించాలనీ, రక్షించబడిన పిల్లల కుటుంబాలకు ఆర్థిక ఉపశమనం అందించాలన్నారు. గ్రామాల్లో అక్రమ రవాణా నియంత్రించడానికి పాఠశాలలు, సంఘాలు, స్థానిక పరిపాలన సంస్థలు కలిసి కట్టుగా కృషి చేయాలి. అవగాహన కార్యక్రమాలను, ప్రచారాలను నిర్వహించి అక్రమరవాణాను అరికట్టాలని ఫౌండేషన్ అభిప్రాయపడింది. ప్రధానంగా అక్రమరవా ణాకు సంబంధించి ఝార్ఖండ్, బీహార్, వెస్ట్బంగాల్, అస్సాం తదితర ప్రాంతాలను ఫౌండేషన్ తన నివేదికలో విశ్లేషించింది. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రధానం గా అక్రమ తరలింపు అంశంలో రైల్వే సహకారం అనివా ర్యంగా గుర్తించాలి. గ్రామీణ ప్రాంతాల నుంచి అధికంగా అక్రమంగా బాలల రవాణా జరిగే ప్రమాదం ఉందని పేర్కొంది. బాలకార్మిక వ్యవస్థను అడ్డుకోవడానికి ప్రజల్లో అవగాహన కల్పించేలా అనేక కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు.
ఆపరేషన్ ముస్కాన్..
బడిలో పాఠాలు చదువుకోవల్సిన బాల్యం యంత్రాల రణగొణధ్వునుల మధ్య జీవిత పాఠాలు నేర్చుకోవలిరావడం బాధాకరం. అయితే బాలకార్మికులను గుర్తించి వారి ఇండ్లకు చేర్చడం, తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం కోసం ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని తెలంగాణ పోలీసులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఫ్యాక్టరీల పై దాడులు నిర్వహించి బాలకార్మికులను పని బాట నుంచి తప్పిస్తున్నారు. మానవ అక్రమ రవాణాపై, బాలకార్మికులపై సమాచారం ఉంటే తక్షణం పోలీసులకు తెలియచేయాలని అధికారులు ప్రజలను కోరారు.