English | Telugu
హోటల్ నిర్లక్ష్యానికి బలైపోయిన చిన్నారి జీవితం...
Updated : Feb 12, 2020
హైదరాబాద్ బేగంపేట లోని మానస సరోవర్ హోటల్ లో కలుషిత ఆహారం తినడం వల్ల ఎన్నారై కుటుంబం అస్వస్థత పాలైంది. హైదరాబాద్ బేగంపేట లోని ప్రముఖ మానస సరోవర్ హోటల్లో వడ్డించిన పన్నీర్ కర్రీతో రోటీ తినడంతో రెండేళ్ల బాలుడు నిహాన్ ప్రాణాలు కోల్పోయాడు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ రవి నారాయణ దంపతులతో పాటు మరో కుమారుడు ఏడేళ్ల వరుణ్ తీవ్ర అస్వస్థత పాలయ్యారు. కేవలం కలుషిత ఆహారం తినడం వల్ల జరిగిన ఈ ఘటన కుటుంబ సభ్యుల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో రెండేళ్ల బాబు మృతి చెందగా. వారితో పాటు మరో ముగ్గురు తీవ్రంగా అస్వస్థకు గురై ప్రస్తుతం బేగంపేట్ లోని కిమ్స్ ఆస్పత్రిల్లో చికిత్స పొందుతున్నారు.
వీసా స్టాంపింగ్ కోసం నిన్న ఉదయం బెంగుళూరు నుంచి హైదరాబాదుకు వచ్చి మానస సరోవర హోటల్ లో వసతి కోసం దిగి స్టాంపింగ్ కోసం వీసా ఆఫీసుకు వెళ్ళారని సమాచారం. వీసా ఆఫీసు నుంచి వచ్చి భోజనం చేసిన తరువాత నుంచి నలుగురు కడుపు నొప్పి తీవ్ర వాంతులతో అస్వస్థతకు గురి అవ్వగా వారిని తక్షణమే .హాస్పటల్ కి తీసుకువెళ్తున్న దారి మధ్యలోనే చిన్నారి మృతి చెందాడని బంధువులు తీవ్ర ఆవేదనను వెల్లడించారు. తక్షణమే హోటల్ పై కఠిన చర్యలనుతీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.