English | Telugu

మాట్లాడే అవకాశాలిస్తాం.. సభకు రండి!

వైసీపీ ఎమ్మెల్యేలను సభకు రావాలంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు మరోసారి కోరారు. అనర్హత వేటు వేళాడుతున్న వేళ వైసీపీ ఎమ్మెల్యేలకు ఆయన మరోసారి సభకు రావాలంటూ కోరడం ప్రాధాన్యత సంతరించుకుంది.

పార్టీలతో సంబంధం లేకుండా అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చినట్లుగానే వైసీపీ సభ్యులకు కూడా మాట్లేడేందకు తగిన సమయం ఇస్తామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. రాష్ట్రంలోని సమస్యలతో పాటు తమతమ నియోజకవర్గాల్లోని ప్రజా సమస్యలకు సంబంధించి అన్ని అంశాలపై చర్చించేందుకు అవకాశం ఇస్తామన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని సభకు హాజరై ప్రజాసమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని అయ్యన్నపాత్రుడు వైసీపీ ఎమ్మెల్యేలను కోరారు.