English | Telugu

ముగిసిన అయోధ్య కేసు ఆఖరి విచారణ

అయోధ్య కేసు రోజు రోజుకు ఓ మలుపు తిరుగుతోంది.అయోధ్యలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి.అయోధ్య వివాదం పై కీలక వ్యాఖ్యలు చేశారు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గగోయ్. సుప్రీం కోర్టు విచారణ చేపట్టి ముప్పై తొమ్మిది రోజులయ్యిందని రేపు నలభై రోజు చివరి రోజు విచారణ జరుగుతుందన్నారు. విచారణ ముగిసిన వెంటనే తీర్పు వెల్లడిస్తామని తెలిపారు చీఫ్ జస్టిస్. అయోధ్య వివాదం పై ఇటు హిందూ సంస్థలు, అటు ముస్లిం సంస్థలు తమ వాదనలను వినిపించాయి. సుప్రీం కోర్టు తీర్పు పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

అయోధ్య పట్టణంతో పాటు మొత్తం జిల్లాలో 144 సెక్షన్ విధించారు అధికారులు. రామ మందిరం, బాబ్రీ మసీదు కేసులో తీర్పు వెలువడనున్న నేపథ్యంలో సెక్షన్ 144 ని విధించారు. ఈ ఆదేశాలు డిసెంబర్ పది వరకు అమల్లో ఉంటాయని జిల్లా కలెక్టర్ తెలిపారు. అయోధ్య కేసును సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ జరుపుతోంది. ఆగస్టు ఆరు నుంచి జరుగుతున్న విచారణ రెండ్రోజులలో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటోంది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం. అయోధ్యలో బాబ్రీ మసీదు కేసు విచారణ విచారణ వీలైనంత త్వరలో ముగిస్తామని తెలిపింది.ఈ విషయం పై కోర్ట్ విచారణలో ఏం జరగబోతోందో ఎలాంటి నిర్ణయాలు తీసుకొబోతోంది అనేది వేచి చూడాలి.