English | Telugu

ఆ మాంసం తిన్నందుకే మ‌నిషికి క‌రోనా!

పంది, కుక్క‌, పిల్లి, పాము, గుర్రం, గాడిద‌, గ‌బ్బిలం, అలుగు మాంసంలో క‌రోనావైర‌స్ ఉంటుంద‌ట‌. వీటి మాంసం తినడం ద్వారా వాటిలో వున్న‌ వైరస్ మనుషుల్లోకి సంక్రమించినట్టు చైనాలోని పెకింగ్​ యూనివర్సిటీ ఆఫ్​ హెల్త్​ సైన్స్​ సెంటర్​ తమ అధ్యయనంలో వెల్లడించింది.

చైనాలోని వుహాన్ సిటీలో ఎక్కువగా పంది, కుక్క‌, పిల్లి, పాము, గుర్రం, గాడిద‌, గ‌బ్బిలం, అలుగు మాంసం ఆహారంగా తింటుంటారు. అక్కడి మార్కెట్లలో ఇలాంటి మాంసానికి డిమాండ్ ఎక్కువ‌ట‌. గబ్బిలాల్లో ఉండే Corona Virus​ జీన్స్​ కాంబినేషన్​తో ఈ కొత్త కరోనా పుట్టుకొచ్చిందని మ‌రికొంత మంది సైంటిస్టులు చెబుతున్నారు. విషపూరిత పాములు China Snakes తమ ఆహారంగా అడవుల్లో Bats గబ్బిలాలను వేటాడి తిని జీవిస్తుంటాయి. గబ్బిలాల్లో ఉండే ఈ ప్రాణాంతక వైరస్.. పాములు వాటిని తినడం ద్వారా సంక్రమించి.. ఆ పాముల మాంసాన్ని తిన్న మనుషుల్లోకి కూడా వైరస్ పాకింద‌ని మ‌రికొన్ని అధ్య‌య‌నాలు తెలుపుతున్నాయి.

ఇప్పుడు ఈ డెడ్లీ కరోనా వైరస్.. గాలి ద్వారా కూడా వ్యాపిస్తూ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఎప్పుడు ఏ క్షణంలో ఎటాక్ చేస్తుందోనన్న భయమే అందరిని బెంబేలిత్తిస్తోంది. డేంజరస్ వైరస్ వేగంగా విజృంభిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొంది. చైనాలో పుట్టిన ఈ వైరస్.. ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిస్తూ ప్ర‌పంచ‌మంతా పాకింది.