English | Telugu
ఆకాశాన్ని అంటుతున్న కూరగాయల ధరలు :- వెల్లుల్లి కిలో రూ.250 , ఉల్లి కిలో రూ.80
Updated : Nov 14, 2019
కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ఉల్లి, వెల్లుల్లి రేట్లు భారీగా పెరుగుతున్నాయి. కిలో వెల్లుల్లి రూ.250 రుపాయలు, ఉల్లి రూ.70 రూపాయలు పలుకుతుంది. భారీ వర్షాల కారణంగా పొరుగు రాష్ట్రాల నుంచి దిగుమతులు పడిపోవడంతో ధరలు చుక్కలనంటుతున్నాయి. ధరలకు రెక్కలొచ్చి.. ఏకంగా రెండొందల దాటి మూడొందలకు పరుగెడుతున్నాయని చెప్పుకోవాలి. దీని కారణంగా సామాన్య మధ్య తరగతి ప్రజలు అసలు కొనలేని పరిస్థితుల్లో ఉల్లి వెల్లుల్లి ధరలు చేరుకున్నాయి.
పూర్తిస్థాయిలో చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇటు ఉల్లిపాయతో పాటకు పాటు వెల్లుల్లి ధరలు కూడా అమాంతంగా పెరిగిపోయాయి. కేజీ ఉల్లిపాయల ధరలు రూ.70 నుంచి 80 రూపాయలు పలుకుతుండగా ఏకంగా వెల్లుల్లి ధరలైతే రెండొందల రూపాయలు దాటి మూడొందల రూపాయల కూడా చేరుకునే పరిస్థితి ఏర్పడింది.చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అయితే ఇదే పరిస్థితి మొత్తం అన్ని జిల్లాల్లోనూ ఉంటుందని వ్యాపార వర్గాలు చెప్తున్నాయి.
మహారాష్ట్రతో పాటు ఉత్తర ప్రదేశ్, గుజరాత్ వంటి ప్రాంతాల నుంచి కూడా ఎక్కువగా వెల్లుల్లి రావాల్సి ఉంది. అక్కడ పంట చేతికి రాకపోవడం.. వరుసగా వర్షాల కారణంగా కూడా పంట దిగుబడి అనేది తగ్గింది. దాని కారణంగా ఏపీకి ఎగుమతి తగ్గిపోవటంతో ఒక్కసారిగా వీటి ధరలు పెరిగాయని చిన్న వ్యాపారస్తులు చెబుతున్నారు. సామాన్యులకు మాత్రం చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పుకోవాలి.. ఎందుకంటే ఉల్లి వెల్లుల్లి లేని పంటలు ఎక్కడా ఉండవని చెప్పవచ్చు. అదే ఆకుకూరల ధరలు కూడా తీవ్రంగా పెరిగిపోయి సామాన్యుడు కూరగాయల ధరలు కొనలేని పరిస్థితి ఏర్పడింది. మధ్య తరగతి వారు కూడా కూరగాయల కొనాలంటే భయపడుతున్న పరిస్థితి వచ్చింది.ఆకుకూరలతో పాటు కొత్తిమీర,కరివేపాకు రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయాయి అనే చెప్పాలి.ధరలపై సామాన్యు లు మధ్య తరగతి వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది.
ముఖ్యంగా వంకాయల ధరలు తీవ్రంగా పెరిగిపోయాయి.. ఇందుకు కారణం పంట పూర్తి స్థాయిలో అందుబాటులో రాకపోవడమేనని వ్యాపారుల చెబుతున్నారు. రెండు నెలల క్రితం వేసిన పంట భారీ వర్షాల వల్ల పూర్తిగా చెడిపోవడంతో దిగుబడి రావడం లేదంటున్నారు. మరో మూడు నెలల పాటు ఈ పంట వచ్చే పరిస్థితి లేని కారణంగా మూడు నెలల పాటు వంకాయల ధర రూ.50 నుంచి 70 రూపాయలు పలికే అవకాశం ఉందని తెలుస్తుంది. సాధారణ ప్రజలు ఇష్టంగా ఏదైనా కొనాలన్నా ..తినాలన్నా.. కష్టాంగా ఉందని వినియోగదారులు బాధ పడుతున్నారు.