English | Telugu

గ్రామ అభివృద్ధి పై కృషి చేస్తున్న వైసిపి ఎమ్మెల్యే రోజా...

గాంధీజీని స్ఫూర్తిగా తీసుకొని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని వైసిపి ఎమ్మెల్యే రోజా సచివాలయ ఉద్యోగులకు సూచించారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో గ్రామ సచివాలయాలను ఆమె ప్రారంభించారు. మరోవైపు పుత్తూరు డిగ్రీ కాలేజీలో గాంధీజీ విగ్రహానికి నివాళులు అర్పించారు. కాలేజీలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను ప్రారంభించారు, ఈ సందర్భంగానే వైసిపి ఎమ్మెల్యే రోజా కొద్ది సేపు జిమ్ చేశారు. స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ వాళ్ళు ఆయనను కొట్టిన, హింసించినా, జైల్లో పెట్టినా కూడా పట్టుదలతో ఆయన సాధించాలనుకున్నది ఏ విధంగా సాధించారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన మీద ఎన్ని కుట్రలు పన్నినా ఈ రోజు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ ఒక్కటై కేసులు పెట్టినా కూడా వారు నిలదొక్కుకున్నారు.

ఈ రోజు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలను, ఎంపీలను దొంగతనంగా వాళ్లు భయబ్రాంతులకు గురిచేసి, డబ్బు ఆశ చూపి కొనుక్కున్నా కూడా ఈ రోజు మొండిగా తన పట్టుదలతో పోరాడి ముఖ్యమంత్రి అయ్యి ప్రజలకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా దాదాపుగా ఎనభై శాతం వంద రోజుల్లోనే పూర్తి చేస్తూ ముందుకు వెళ్తున్నాడు అంటే ఈయన గాంధీగారికి నిజమైన నివాళులు అర్పించారు అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి అని వైసిపి ఎమ్మెల్యే రోజా తెలియజేశారు. ఈ రోజున యువత కూడా గాంధీ గారిని గుర్తు చేసుకుంటూ గాంధీ గారి లాగా ప్రతి ఒక్కరు కూడా పట్టుదలతో అనుకున్నది సాధించే విధంగా జగనన్న ఎలా చేశాడో అలా ప్రతి గ్రామానికి కూడా వృద్ధి చేసే విధంగా తమకిచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించాలని కోరుకొంటున్నానని ఎమ్మెల్యే రోజా తెలిపారు.