English | Telugu

ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో ఏపీ నెంబర్‌వన్‌.. క్రెడిట్ చంద్రబాబుదే!!

ఈజ్ ఆప్ డూయింగ్ బిజినెస్‌(సులభతర వ్యాపార నిర్వహణ)లో ఆంధ్రప్రదేశ్‌ నెంబర్‌వన్‌ స్థానం నిలబెట్టుకుంది. 2019 ఏడాదికిగాను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ శనివారం ర్యాంకులు విడుదల చేశారు. ఏపీ మొదటి స్థానంలో నిలువగా రెండోస్థానంలో ఉత్తర ప్రదేశ్‌, మూడోస్థానంలో తెలంగాణ రాష్ట్రాలు నిలిచాయి. ఇంత‌కు ముందు ఏడాది రెండో స్థానంలో నిలిచిన తెలంగాణ ఈ సారి ఒక స్థానం దిగ‌జారింది. ఇక తెలంగాణ‌ త‌ర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్, ఝార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్ ఉన్నాయి.

కాగా, ఈజ్ ఆప్ డూయింగ్ లో ఏపీ అగ్ర‌స్థానంలో నిలవ‌డానికి త‌న తండ్రి, టీడీపీ అధినేత చంద్ర‌బాబే కార‌ణ‌మ‌ని నారా లోకేష్ ట్వీట్ చేశారు. "ఇది చంద్ర‌బాబు క‌ష్ట‌ప‌డి ప‌నిచేసేత‌త్వానికి ఓ నిద‌ర్శ‌నం. ఆయన కష్టం వల్లే ఈజ్ ఆప్ డూయింగ్ 2019లో టాప్ లో ఏపీ నిలిచింది. వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళికను స‌మ‌ర్థంగా అమ‌లు చేసినందుకు ధ‌న్య‌వాదాలు. చంద్ర‌బాబులా వైఎస్ జ‌గ‌న్ కూడా ఏపీలో మంచి ప‌నుల‌ను చేయాల్సింది.. కానీ చేయ‌క‌పోవ‌డం విచార‌క‌రం" అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.