English | Telugu
మంత్రి వెల్లంపల్లికి కరోనా పాజిటివ్.. తిరుమలలో సీఎం వెంటే ఉన్న మంత్రి
Updated : Sep 28, 2020
ఇటీవల తిరుమలలో జరిగిన బ్రహ్మోత్సవాల సందర్భంగా మంత్రి వెల్లంపల్లి వారం రోజులు పాటు తిరుమలలోనే ఉన్నారు. అలాగే స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించే దగ్గర నుండి కర్ణాటక సీఎం యడియూరప్పతో కలిసి పాల్గొన్న కార్యక్రమంతో పాటు.. చివరకు హైదరాబాద్ కు బయలుదేరేవరకు అయన సీఎం జగన్ తోనే వున్నారు. దీంతో సీఎం ఆరోగ్యం పట్ల పార్టీ శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. తాజాగా ఆయనకు కరోనా పాజిటివ్ గా తేలడంతో సీఎం జగన్ ఆరోగ్యంపై పార్టీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.