English | Telugu
ఏపీ అసెంబ్లీ సమావేశాలు కుదింపు
Updated : Sep 18, 2025
ఏపీ అసెంబ్లీ వర్షాకాల పనిదినాలు 8 రోజులకు ప్రభుత్వం కుదించారు. దీంతో ఈనెల 27 వరకు సమావేశాలు జరగనున్నాయి. శాసన సభ వర్షాకాల సమావేశాలు 10 రోజుల పాటు నిర్వహించాలని సభాపతి అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో తొలుత నిర్ణయించారు. కానీ, ఆ తర్వాత 8 రోజులకు కుదించారు. రోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సభ జరగనుంది.
సభలో చర్చించేందుకు 18 అంశాలను టీడీపీ, 9 అంశాలను బీజేపీ ప్రతిపాదించింది. ప్రశ్నోత్తరాలతో పాటు శూన్య గంటలోనూ మంత్రులు ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు రేపు మధ్యాహ్నం రూ. 1.30 గంటలకు సీఎం అధ్యక్షతన మంత్రి వర్గ సమావేశం జరగనుంది. సభలో ఆమోదించాల్సిన అంశాలపై చర్చించనుంది.