కరోనా వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో, దేవాలయాలు, మసీదులు, చర్చి లో మత పరమైన కార్యక్రమాలు చేస్తున్నవారికి 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అర్చకులు, ఇమామ్, మౌజమ్స్, పాస్టర్ లకు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. గుర్తింపు పొందిన మసీదు వారికే కాకుండా, గుర్తింపు పొంది ని వారికి ఇవ్వాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఇప్పటికే అర్చకులకు కూడా ఇవ్వాలని గతం లో నే ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం , ఇందుకు అర్హులైన వారిని గుర్తించాలని దేవాదాయశాఖ, వక్ఫ్ బోర్డు, క్రిస్టియన్ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ కి ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ వేతనం పొందుతున్న వారికి ఈ పథకం వర్తించదు అని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీఓ విడుదల చేసింది.