English | Telugu

రోజా జీతమెంతో తెలుసా? మరోసారి అలగకుండా జీతభత్యాలు.! 

మంత్రి పదవి ఇవ్వలేదని అలిగిన నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజాను శాంతింపజేయడానికి ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా నియమించి కేబినెట్ ర్యాంక్ హోదా కట్టబెట్టిన సీఎం జగన్మోహన్ రెడ్డి... ఇప్పుడు ఆమె జీతభత్యాలు కూడా అదే స్థాయిలో చెల్లించేలా జీవో జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మించి... రోజాకు జీతభత్యాలు ఇస్తున్నారు. ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ హోదాలో ఆమెకు నెలకు 3.82లక్షల రూపాయలను చెల్లించనున్నారు. ఇందులో 2లక్షలు అసలు వేతనం కాగా, వాహన సౌకర్యానికి 60వేలు... క్వార్టర్స్ కు 50వేలు... మొబైల్ ఫోన్ ఛార్జీలకు 2వేలు... వ్యక్తిగత సిబ్బందికి 70వేలు ఇవ్వనున్నట్లు జీవోలో తెలిపారు. అంటే మొత్తంగా ప్రతి నెలా రోజాకి దాదాపు 4లక్షల రూపాయల జీతభత్యాలు అందనున్నాయి. వైసీపీలో ఫైర్ బ్రాండ్ గా ముద్రపడ్డ రోజాకి ఈ మాత్రం జీతం ఇవ్వాల్సిందేనేమో. లేదంటే మళ్లీ అలిగినా అలగొచ్చు.