English | Telugu

ఏపీలోని అన్ని విద్యాసంస్థలకు జూన్ 11 వరకు సెలవులు

ఏపీలోని అన్ని విద్యాసంస్థలకు జూన్ 11 వరకు సెలవులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వేసవి సెలవులు జూన్ 11 వరకు ఇస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, కరోనా వైరస్ ప్రభావాన్ని బట్టి పాఠశాలలు ఎప్పుడు తెరవాలనే అంశంపై ప్రభుత్వం తరఫున మరోసారి అధికారికంగా తెలియజేస్తామని తెలిపింది. ప్రభుత్వం ఆదేశాలు వచ్చిన తర్వాత మరోసారి దీనిపై స్పష్టతనిస్తామని ప్రకటించింది.

విద్యా సంవత్సరం ఆరంభంలో ప్రైవేట్ విద్యాసంస్థలు, జూనియర్ కాలేజీలు అన్నీ కూడా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి మొదటి త్రైమాసికానికి సంబంధించిన ఫీజులు మాత్రమే తీసుకోవాలిని రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ చైర్ పర్సన్ జస్టిస్ కాంతారావు కీలక ఆదేశాలు జారీ చేశారు.