English | Telugu
లంచాలు గుంజడంలో ఏపీ ఉద్యోగులు టాప్..! తాజా సర్వేలో వెల్లడి
Updated : Nov 13, 2020
తాము చేసిన పనికి మించి అదనంగా డబ్బులు ఇవ్వాలని విద్యుత్ శాఖ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారని వినియోగదారులు స్వయంగా ఈ సర్వేలో వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈ సర్వే లో పాల్గొన్నవారిలో గృహ వినియోగదారులు 33% మంది, సంస్థాగత వినియోగదారులు 21% శాతం మంది ఉన్నారు. గుజరాత్ ఉద్యోగులలో అవినీతి తక్కువగా 8 శాతం ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ, తూర్పు డిస్కంల పరిధిలో అత్యధికంగా 57 శాతంగా ఉందని తేలింది. దేశంలోని వివిధ రాష్ట్రాలలో విద్యుత్తు సమస్యలు తెలుసుకోవడానికి 10 రాష్ట్రాల్లోని 25 డిస్కంల పరిధిలో 25,116 మంది వినియోగదారులను సర్వే చేశారు. దీంట్లో ఏపీలో 1,809 మంది ఉన్నారు. ఈ సర్వేపై స్పందించిన నీతి ఆయోగ్ అటు వినియోగదారులను చైతన్య పరచడంతో పాటు, ఇటు అదనపు మొత్తాలను అడిగే సిబ్బందిపై కూడా సంబంధిత డిస్కింలు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.