మీడియా కుట్ర అంటూ డిప్యూటీ సి.ఎం. అంజాద్ బాషా ప్రతికా ప్రకటన విడుదల చేశారు. " నేను ఈ నెల 2వ తేదీన ముస్లింలకు వైఎస్సార్ ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్ కేసు విషయమై ఢిల్లీ వెళ్ళాను. కానీ నేను అక్కడి మత ప్రార్థనలకు వెళ్లినట్లు దుష్ప్రచారం మొదలుపెట్టారు. నేను ఒక రాష్ట్రానికి డెప్యూటీ సీఎంను..నాకు ప్రోటోకాల్ ఉంటుంది.అందులో నా ప్రతి ఒక్క అడుగు నమోదు అవుతుంది.ఆ రోజు నేను ఏపీ భవన్ లొనే బస చేసాను.మరుసటి రోజు సీఎం గారిని కలిశాను...4వ తేదీ కాబినెట్ లోనూ ఉన్నాను.ఆ తర్వాత కడప చేరుకుని ఎన్నికల పనుల్లో పడ్డాం," అంటూ చెప్పుకొచ్చిన అంజాద్ బాషా నిజాలు తెలుసుకోకుండా ఇష్టారీతిన రాయడమే జర్నలిజమా అని ప్రశ్నించారు. "కనీసం నా వివరణ కూడా అడగలేదు.ఇదంతా ఈ కరోనా సమయంలో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, నన్ను ఇబ్బంది పెట్టాలని మీడియా పన్నిన కుట్ర. అందుకే నేను చట్టపరంగా క్రిమినల్ కేసు పెడతాను...పరువు నష్టం దావా వేస్తాను. ప్రజలంతా వాస్తవాలు తెలుసుకోవాలన్నారు.
అంతే.. సోషల్ మీడియాలో నిజాముద్దీన్ దర్గాకు మంత్రి వెళ్లిన ఫొటోలు మార్చి 2 వ తేదీన పోస్ట్ చేసుకున్నారు. ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఎక్కడికీ వెళ్లలేదన్నారుగా మంత్రిగారు నిజాముద్దీన్ దర్గాకు ఎలా వెళ్లారు. ఈ ఫొటోలు ఏమిటి? దీనిపైన కూడా వివరణ ఇస్తే బాగుండేది. మార్చి 2వ తేదీ మీరు ఢిల్లీలో వున్నట్లు మీరే చెప్పారు. దర్గా సాక్షిగా అబద్దాలాడడం కరెక్టేనా? అది వేరు మీరు తబ్లీక్ జమాత్ మర్కజ్‌కు వెళ్లక పోవచ్చు... దర్గాకు వెళ్ళారా? లేదా? దీనిపై డిఫ్యూటీ సి.ఎం. సమాధానం ఏమిటి? భయపడడం ఎందుకు. వాస్తవాలు చెప్పండి.