English | Telugu
మీరు అవునంటే మేము కాదనిలే.. ఎన్నికల కమిషన్ కు ఏపీ సర్కార్ లేఖ
Updated : Nov 17, 2020
ప్రస్తుత పరిస్థితుల్లో కనుక ఎన్నికలు జరిపితే వైరస్ గ్రామాలకు కూడా పాకిపోతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి పోలీసులు, వివిధ శాఖల ఉద్యోగులు, పరిపాలన సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని.. పరిస్థితి అనుకూలించిన వెంటనే ఎన్నికల సంఘానికి సమాచారం అందిస్తామని సీఎస్ ఆ లేఖలో తెలిపారు. ప్రజల ఆరోగ్యం, భద్రత నేపథ్యంలో ఫిబ్రవరిలో ఎన్నికల నిర్వహణ ఎంతమాత్రమూ ఆమోద యోగ్యం కాదని అన్నారు. అలాగే, ఎన్నికల కమిషన్ నేడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్టు తెలిసిందని, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అది కూడా అవసరం లేదని తాము భావిస్తున్నట్టు నీలం సాహ్ని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దమవుతున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ.. ఈరోజు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సమావేశం అవుతున్నారు.