English | Telugu
కీలక నిర్ణయాలు తీసుకున్న ఏపీ కేబినెట్... స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్...
Updated : Feb 12, 2020
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా ఏపీ అగ్రికల్చర్ కౌన్సిల్ ఏర్పాటు ముసాయిదాకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అలాగే ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ ముసాయిదా బిల్లుకు కూడా ఆమోదం తెలిపింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు పెట్టాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. ఇక,
స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 15కల్లా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని నిర్ణయించారు. అయితే, స్థానిక ఎన్నికల్లో డబ్బు, మద్యానికి తావులేకుండా చేయాలని, ఒకవేళ ఏ అభ్యర్ధి అయినా మద్యం, డబ్బు పంపిణీ చేస్తూ దొరికితే అనర్హత వేటేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం మూడేళ్ల శిక్షతోపాటు అనర్హత వేటు పడుతుందని గుర్తుచేశారు. ఇక, పంచాయతీ ఎన్నికల ప్రక్రియను 13రోజుల నుంచి 15రోజులకు పొడిగించే చట్టానికి కేబినెట్ ఆమోదం తెలిపింది.