English | Telugu

ఊహించని విధంగా కరోనాకు మరో మందు.. ఆశ్చర్యపోయిన డాక్టర్లు

ప్రపంచం మొత్తం కరోనా తీవ్రత తో అతలాకుతలం అవుతోంది. ఇక భారత్ విషయానికి వస్తే కరోనా కేసుల సంఖ్యలో ప్రపంచం లోనే మూడవ స్థానానికి చేరుకుంది. దీంతో కరోనాకు విరుగుడుగా మన దేశంలో ఒక పక్క వ్యాక్సిన్ ప్రయోగాలు జోరందుకున్నాయి. మరో పక్క దీనికి తగిన మందుల కోసం పరిశోధకులు తీవ్రంగా శోధిస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే ఇతర వ్యాధుల కు వాడే మందులతో కరోనా పేషంట్ల కు ఇచ్చే ట్రీట్ మెంట్ లో వాడి వాటి ఫలితాలపై అధ్యయనం చేస్తున్నారు.

ఐతే ఇదే విషయమై ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం మహారాష్ట్ర లో కరోనా తీవ్రత చాల ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ముఖ్యంగా ముంబై లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడి ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న సేవ్రి టీబీ హాస్పిటల్ లో 400 మంది టీబీ పేషంట్లు ఉన్నారు. ఈ హాస్పిటల్ లో టీబీ తీవ్రంగా ఉన్న పేషంట్లకు ట్రీట్ మెంట్ ఇస్తారు. ఐతే ఇక్కడ పని చేస్తున్న 17 మంది నర్సులతో సహా 53 మంది వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు. కానీ ఒక్క టీబీ పేషంట్ కు కూడా కరోనా సోకలేదు. దీంతో ఆశ్చర్యపోయిన ఈ హాస్పిటల్ డాక్టర్లు దీని పై దృష్టి పెట్టారు. ఇక్కడి టీబీ పేషెంట్లకు ఇస్తున్న టాబ్లెట్ల వల్లే కరోనా రావట్లేదని వారికీ అర్థమైంది. దీంతో ఆ టాబ్లెట్లు వలన కరోనాకు బ్రేక్ పడినటుగా గుర్తించారు. ఇదే విషయాన్ని ఆ డాక్టర్లు వెళ్లి బృహన్ ముంబై కార్పొరేషన్ లోని టీబీ నియంత్రణ అధికారులకు చెప్పారు. దీంతో ఆశ్చర్యపోయిన కార్పొరేషన్ అధికారులు భారత వైద్య పరిశోధనా మండలి(ICMR)కి ఈ సంగతి చేరవేశారు.

ప్రజలను బెంబేలు పెడుతున్న కరోనా వైరస్ లాగే పల్మనరీ టీబీ కూడా ఊపిరితిత్తులపైనే దాడిచేస్తుంది. ఈ రెండు వ్యాధుల్లోనూ ప్రధాన లక్షణం దగ్గే కావడం గమనార్హం. ఈ పేషంట్లు కంటిన్యూగా దగ్గుతూనే ఉంటారు. దీనికి తోడు జ్వరం రావడం, ఊపిరి అందకపోవడం అనే లక్షణాలు కూడా ఈ రెండు వ్యాధులలోనూ కామన్ గా ఉన్నాయి. అంతే కాకుండా ఈ టీబీ పేషంట్ల లో ఎక్కువ మంది మురికి వాడలైన మాన్ఖుర్డ్, గోవండీ నుంచి వచ్చినవారే. కరోనా వ్యాపిస్తున్న మొదట్లో అందరికంటే ముందుగా అది టీబీ పేషెంట్లకే వ్యాపిస్తుందని డాక్టర్లు భావించారు. ఐతే ఆశ్చర్యకరంగా అందుకు విరుద్ధంగా జరుగుతోంది. టీబీ పేషెంట్లలో వ్యాధి నిరోధక శక్తి ఎలా పెరుగుతోంది అనే విషయం పై పరిశోధన చేయాల్సిన అవసరం ఉందంటున్నారు డాక్టర్లు.