English | Telugu

ఫ్రీస్కూల్స్ గా అంగన్ వాడీ కేంద్రాలు

తెలంగాణ రాష్ట్రంలోని అంగన్ వాడీ కేంద్రాలను ఫ్రీస్కూల్స్ గా మార్చి ఆంగ్లమాధ్యమంలో బోధన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఆధునిక సౌకర్యాలు అంటుబాటులోకి తీసుకువచ్చి ఆన్ల్ లైన్ పాఠాల ద్వారా చిన్నారులు విద్యాబోధన అందించనున్నారు. పిల్లల మానసిక వికాసం పెంచేలా కథలు, పాటలు వీడియో ల ద్వారా వివరించేలా అంగన్ వాడీ టీచర్లకు శిక్షణ ఇవ్వనున్నారు.

రాష్ట్రంలో 149 ఐసిడిఎస్ ప్రాజెక్టు ల ద్వారా 35,700 అంగన్ వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయి. ఇందులో 31,711 మెయిన్ సెంటర్స్ కాగా 3898 మినీ సెంటర్స్ ఉన్నాయి.మొదటిదశలో మెయిన్ సెంటర్స్ లో ఎంపిక చేసిన కొన్ని సెంటర్లను ఫ్రీస్కూల్స్ గా మార్చనున్నారు. వీటిని తొమ్మిది గంటల నుంచి 4 గంటల వరకు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆన్లైన్ విధానం ద్వారా పిల్లలకు పాఠాలు చెప్పాలని రాష్ట్ర మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది.