English | Telugu
కేంద్రంతో చర్చల ప్రసక్తే లేదు.. ఆ బిల్లును వెనక్కి తీసుకోవాల్సిందే: తేల్చి చెప్పిన రైతులు
Updated : Nov 30, 2020
దీంతో రైతుల నిరసన, అలాగే ప్రభుత్వ చర్చల ప్రతిపాదనను రైతులు తిరస్కరించిన నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో నిన్న అర్ధరాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్, వ్యవసాయ మంత్రి తోమర్ అత్యవసరంగా సమావేశమయ్యారు. తాజాగా ఢిల్లీని అన్ని వైపుల నుండి దిగ్బంధిస్తామని రైతు సంఘాల నేతలు హెచ్చరించిన నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. అంతేకాకుండా హర్యానా సీఎం ఖట్టర్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ చేసిన వ్యాఖ్యలు కూడా కేంద్ర మంత్రుల మధ్య చర్చకు వచ్చాయి. దీంతో పాటు నిరసన తెలుపుతున్న రైతుల విషయంలో తదుపరి కార్యాచరణ ఏంటన్న దానిపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది. కొత్త వ్యవసాయ చట్టాలను తీవ్రం గా నిరసిస్తూ ఉద్యమించిన ఉత్తర భారతానికి చెందిన రైతులు వరుసగా నాలుగో రోజూ ఢిల్లీ పొలిమేరల్లోనే బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. పంజాబ్, హరియాణ, యూపీ, ఉత్తరాఖండ్, రాజస్థాన్‌ల నుంచి వేలాది మంది రైతులు వణికే చలిని కూడా లెక్క చేయకుండా తమ నిరసన కొనసాగిస్తున్నారు.