English | Telugu
దీక్షిత్ ను కిడ్నాప్ చేసి హత్య చేసిన కిడ్నాపర్లు.. ఈజీ మని కోసమే అంటున్న పోలీసులు
Updated : Oct 22, 2020
ఈ కిడ్నాప్.. హత్య కేసును చేధించిన పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు. ఐదు రోజుల క్రితం దీక్షిత్ ను మంద సాగర్ అనే వ్యక్తి కిడ్నాప్ చేసినట్లు తెలిపారు. ఈజీ మనీ కోసమే అతడు ఈ కిడ్నాప్ కు పాల్పడ్డాడని, కిడ్నాప్ కు ముందు పలుసార్లు రెక్కీ నిర్వహించినట్లు ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. కిడ్నాప్ అలాగే హత్య చేసింది అంతా ఒక్కరేనన్న ఎస్పీ… కిడ్నాప్ చేసిన గంటలోపే ఆ బాలుడిని అతి కిరాతకంగా చంపేశాడని తెలిపారు. శనిగపురం గ్రామానికి చెందిన కిడ్నాపర్ మెకానిక్ గా పనిచేస్తున్నాడని, డబ్బు మీద అతి ఆశతోనే బాలున్ని కిడ్నాప్ చేసి తళాసుపల్లి ప్రాంతానికి తీసుకెళ్లాడన్నారు. అయితే కేవలం డబ్బుల కోసం మాత్రమే కిడ్నాప్ కు చేసినప్పటికి, ఎక్కడ దొరికిపోతానన్న భయంతోనే బాలున్ని హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే నిందితుడిని ఇంకా విచారిస్తే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని ఎస్పీ తెలిపారు.