English | Telugu

విశాఖలో మరో భారీ అగ్ని ప్రమాదం

విశాఖ గేట్ వే కంటైనర్ యార్డులో అగ్నిప్రమాదం సంభవించింది. విమానాశ్రయం సమీపంలోనిషీలా నగర్ సిఎఫ్ఎస్ కంటైనర్ యార్డులో మంటలు ఎగిసిపడడంతో స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. హానికర రసాయనం అల్యూమినియం ఫ్లోరిడే క్యాచ్లు ద్వారా వ్యాపిస్తున్న దట్టమైన పొగ తో మంటలు ఎగిసిప‌డుతున్నాయి.అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని మంట‌ల‌ను ఆర్పేందుకు య‌త్నిస్తున్నారు. ఈ ప్రమాదంతో స్థానిక ప్రాంతాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.