English | Telugu
అనంతపురంలో మూడు రిజర్వాయర్లకు శంకుస్థాపన
Updated : Dec 9, 2020
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం రైతుల అభ్యున్నతి కోసం పాటుపడుతుందని అన్నారు. గత ప్రభుత్వం జీవో ఇచ్చి, పనులు మాత్రం చేయలేదని విమర్శించారు. ఇప్పుడు స్టోరేజీ కెపాసిటీని కూడా పెంచామన్నారు. ఈ పనుల వల్ల రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు. ముట్టాల, దేవరకొండ, తోపుదుర్తి రిజర్వాయర్లు.. హంద్రీనీవా నుంచి పేరూరు డ్యాంకు నీటిని తరలించనున్నట్లు తెలిపారు. దాంతో 7 మండలాలకు మేలు జరుగుతోందన్నారు. రిజర్వాయర్లు, ప్రధాన కాల్వల కోసం రూ. 800 కోట్లు విడుదల చేశామని సీఎం చెప్పారు.