English | Telugu
బీజేపీ నేతతో స్టార్ హోటల్ లో వైసీపీ లీడర్ల మీటింగ్స్.. వైసీపీ లో కలవరం.!
Updated : Jun 27, 2020
ఆ స్టార్ హోటల్ ఫుటేజ్ లో తమ పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీ ఎంపీ సుజనా ను కలిసిన ఆధారాలు దొరికాయి. ఇప్పటికే నరసాపురం ఎంపీ పార్టీ అధిష్టానం పై తిరుగుబాటు తో పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. దీంతో పాటు కొంత మంది సీనియర్ నాయకులూ కొంత కాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో తమ పార్టీ నేతలు సుజనా తో భేటీ కావడం తో అసలు పార్టీలో ఏం జరుగుతోందని మదనం మొదలైనట్లు సమాచారం. బీజేపీ ఎంపీ సుజనా ను కలిసిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ కారణం తో కలిసారో అరా తీసే పనిని కొంత మంది ప్రభుత్వ సలహాదారులకు అప్పగించినట్లుగా తెలుస్తోంది. మరో వైపు కొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంపీ సుజనా చౌదరిని కలిసినట్లుగా అయన సన్నిహిత వర్గాలు కూడా ధ్రువీకరిస్తున్నాయి.