English | Telugu

దీర్ఘకాలం ప్రభావం చూపనున్న విశాఖ విషవాయువు..!

విశాఖలో తలెత్తిన విపత్కర పరిణామాలు ఇప్పట్లో సమసిపోయే పరిస్థితులు కనిపించడం లేదు. పండించే పంట నుండి భూగర్బంలోనిండి వచ్చే నీటి బిందువు వరకూ కలిషితమైపోయినట్టు నిపుణులు నిర్ధారిస్తున్నారు. పీల్చే గాలి కూడా కలిషితం అయిపోయిట్టు, అవన్ని సామన్యస్థితికి రావడానికి కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఎల్ జి పాలిమర్స్ పరిశ్రమ చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో పచ్చదనం అన్న పదమే లేదు . ఇప్పటివరకు పండించిన పంట అంతా నాశనం అయిపోయింది . బావుల్లో నీరు తాగడానికి కాదు కదా కనీసం వాడేందుకు కూడా పనికిరాకుండా పోయాయి. ఇక మనిషి శరీరంలో ఉన్న స్టైరీన్ పాలీమర్ గా మారి విషవాయువుని ఉత్పత్తి చేసే అవకాశాలు కూడా ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎల్ జి పాలిమర్స్ పరిశ్రమ నుండి వెలువడిన గ్యాస్ చుట్టుపక్కల పది కిలోమీటర్ల వరకు ఉన్న ప్రకృతిని నాశనం చేసింది. 12 మంది ప్రాణాలు వదలగా కొన్ని వందలమంది ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు . ఈ గ్యాస్ పీల్చిన వారు కాకుండా ప్రస్తుతానికి ప్రాణాలతో బయటపడిన వారిలో కూడా దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతాయి అని వైద్యులు మరియు నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. అలాగే ఆ ప్రాంతంలో పుట్టబోయే చాలామంది అంగవైకల్యం బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయట.

ఎల్జీ పాలిమర్స్ వెదజల్లిన విషవాయువు వల్ల ప్రకృతి అందించే ఫలాలను కూడా తినకూడని పరిస్థితులు తలెత్తాయి. ప్రకృతిలో దొరికే ఎన్నో త్రాగే, ఆహారాలను విషవాయువు వినాశనం చేసింది.
ఈ విషవాయువు వల్ల మొత్తం ప్రకృతే కాకుండా ప్రకృతి మీద ఆధారపడిన జీవకోటి మనుగడకు కూడా ప్రమాదం పొంచి ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

పంట పొలాలు కలుషితమై పండిన పంటలు తినేందుకు ప‌నికిరావ‌ట‌. పంటపొలాల్లో ఉండే బావుల్లో నీటి పరిస్థితి కూడా ఎంతొ ప్రమాదకరంగా మారినట్టు తెలుస్తోంది. తాగడానికి, వాడకానికి అస్సలు పనికి రావని తెలుస్తోంది. పెద్ద ఎత్తున వర్షం వచ్చి నీరు కొట్టుకు పోవడం గానీ, ఆ నీరు ఎండిపోవడం గానీ జరిగితే పాలిమర్ ప్రభావం తగ్గుతుంది తప్ప అప్పటివరకూ విషప్రభావం ఉంటుందని వాతావరణ నిపుణులు చెప్పుకొస్తున్నారు. ఈ వాయువు తీవ్ర దుష్ప్రభావాని చూపుతుందని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

అక్కడి పరిస్థితులను పరిశీలించిన నిపుణులు అక్కడ అంతా విషపూరితం అయిపోయింది అని తేల్చి చెప్పారు . త్రాగు నీరు, ఆహారం , భూమి, ఆకాశం లోని వాయువు అన్నీ కలుషితం అయినట్లు తెలిసిన వారు మరికొన్ని సంవత్సరాలు ఈ పరిస్థితి ఇలాగే కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు స్పష్టం చేశారు.

చుట్టూ ఉన్న గ్రామస్తులంతా ఆ ప‌రిశ్ర‌మ‌ను ఇక్క‌డి నుంచి త‌ర‌లించాల‌ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. పచ్చని చెట్లతో, సముద్రపు అలల గలగలలతో సస్యశ్యామలంగా, ప్రకృతి శోభతో విరాజిల్లే విశాఖ పట్టణం ఇప్పుడు కలుషిత పట్టణంగా మారిపోయింది.