English | Telugu

విజయవాడ లో పోలీస్ కమిషనర్ పర్యటన

కరోనా పాజిటివ్ సోకి మృతిచెందిన వ్యక్తి ప్రాంతాన్ని విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు పరిశీలించారు. విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్ లోని ప్రజలలో ధైర్యంనింపేందుకు ఆ ప్రాంతంలో ఆయన పర్యటించారు. విజయవాడ లో మోత్తం16 కేసులు నమోదు అయ్యాయి..11కేసులు ఢీల్లి నిజాముద్దీన్ సమావేశం లో పాల్గొన్నవారు, ఐదుగురు విదేశాలనుండి వచ్చినవారు ఉన్నారని ద్వారకా తిరుమలరావు చెప్పారు. " పాజిటీవ్ కనపడిన వ్యక్తుల కుటుంబ సభ్యులకు వైద్య పరిక్షలు నిర్వహిస్తున్నాం. డీల్లి సదస్సు కు వెళ్ళి వచ్చిన కుమ్మరి పాలెం సెంటర్ కు చెందిన వ్యక్తి కుటుంబ సెభ్యులు పాజీటివ్ బారిన పడ్డారు..

అతని తండ్రి చనిపోయారు.ఎవరిని తప్పు పట్టటంలేదు.. డిల్లి సదస్సు కు వెళ్ళి వచ్చిన వారు వారిని కలిసిన వారు తప్పనిసరిగా వైద్య పరిక్షలు నిర్వహించుకోవాలి.చాల మంది స్వచ్చందంగా ముందుకు వచ్చి పరిక్షలు చేయించుకుంటున్నారు. మిగతావారు కూడా ముందుకు రావాలి. మీ ఆరోగ్యం మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం మాకు ముఖ్యం. విజయవాడ నగరంలో కొన్ని ప్రాంతాలలో కర్ప్యూ విధించాం," అని కూడా పోలీస్ కమిషనర్ చెప్పారు. కొన్ని ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించామనీ, రాష్ట్రంలో కరోనా తోలి మరణం విజయవాడ లో జరగడం బాధాకరమని అన్నారాయన. " ముందుగానే హెచ్చరించాం.. వారు పట్టించుకోక పోవటం అతనికి ఇతర వ్యాదులు ఉండటంతో ఆటను మరణించాడు," అని ఆయన చెప్పారు.