English | Telugu
పండుగల సీజన్ నేపథ్యంలో ముంచుకొస్తున్న కరోనా ముప్పు
Updated : Nov 30, 2020
దీనిపై అమెరికా అంటువ్యాధుల నివారణ నిపుణుడు ఆంథోని ఫౌచీ అందోళన వ్యక్తం చేసారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో సమావేశాలు, ప్రయాణాలు పెరుగుతాయని దీంతో కేసులు భారీ స్థాయిలో పెరుగుతాయని అయన అన్నారు. అయితే తాను ఈ విషయం ఎవరినో భయపెట్టడానికి చెప్పడం లేదని, కేవలం దేశ ప్రజల్ని అప్రమత్తం చేయడానికే చెబుతున్నానని అయన అన్నారు.
కరోనాను మొదట్లో సమర్థంగా ఎదుర్కొన్న దేశాల్లోనూ వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోందని, ప్రజలు నిబంధనల్ని తప్పనిసరిగా పాటించాలని అయన అన్నారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలోపు కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని అప్పటివరకు ప్రజలు మాస్క్ ధరించడంతో పాటు సోషల్ డిస్టెన్స్ పాటించాలని అయన తెలిపారు. క్రిస్మస్ తర్వాత కరోనా విజృంభణ ఏకంగా పదింతలు పెరిగే అవకాశం ఉందని, దీంతో ఏం జరుగుతుందోనని ఆందోళనగా ఉందని అంటువ్యాధుల నిపుణురాలు డెబోరా బిర్క్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు.