English | Telugu

శ్రీవారి దర్శనం ప్రారంభమైంది

కరోనా వైరస్‌ ప్రభావంతో 80 రోజుల పాటు నిలిచిన శ్రీవారి దర్శనం తిరిగి ప్రారంభమైంది. ఈరోజు ఉదయం నుంచి శ్రీవారి దర్శనాన్ని టీటీడీ పున:ప్రారంభించింది. మూడు రోజుల పాటు ట్రైల్ రన్ క్రింద ఉద్యోగులు, స్థానికులను టీటీడీ దర్శనానికి అనుమతించనుంది. రెండురోజులు టీటీడీ ఉద్యోగులకు, మూడో రోజున స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించి ట్రయల్‌ నిర్వహించనున్నారు. 11వ తేదీ నుంచి ఇతర ప్రాంతాల భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నారు.

ఈ ఉదయం 9 గంటలకు దర్శనాలను ప్రారంభించగా, స్వామివారి సేవలో తరిస్తున్న టీటీడీ ఉద్యోగులు స్వామిని దర్శించుకోవడానికి క్యూ కట్టారు. మాస్క్ లను ధరించిన ఉద్యోగులు.. భౌతిక దూరం పాటిస్తూ క్యూ లైన్లలో ఆలయంలోకి వెళ్లారు. కాగా, సుదీర్ఘ విరామం అనంతరం, దర్శనాలు తిరిగి ప్రారంభమైన వేళ.. శ్రీవారి ఆలయాన్ని వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలకరించారు.