English | Telugu
పీఐబీ అధికారికి కరోనా.. ఆందోళనలో కేంద్ర మంత్రులు!
Updated : Jun 8, 2020
సోమవారం పీఐబీ భవనాన్ని పూర్తిగా శానిటైజ్ చేయాలని నిర్ణయించారు. నేటి నుంచి పీఐబీ కార్యక్రమాలు, విలేకరుల సమావేశాల నిర్వహణను శాస్త్రిభవన్ కేంద్రంగా నిర్వహించాలని నిర్ణయించారు.
కాగా, కరోనా సోకిన పీఐబీ అధికారి వాలియా.. జూన్ 3వ తేదీన కేంద్రమంత్రులు నరేంద్ర సింగ్ తోమార్, ప్రకాష్ జవదేకర్ లతో కలిసి.. కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించారు. ఆ రోజు మీడియా సమావేశానికి వచ్చిన వారందరినీ హోమ్ క్వారంటైన్ చేయాలని నిర్ణయించామని, వారికి కరోనా పరీక్షలు చేయిస్తామని అధికారులు తెలిపారు.