English | Telugu
టబ్ లో జలకాలాడిన పులి
Updated : Dec 11, 2020
సాధారణంగా పులులు సరస్సులు, కొలనుల్లో జలకాలాడడం చూస్తుంటాం. కానీ ఓ పులి మాత్రం చిన్న పిల్లోడిలాగా టబ్ లో దిగి స్నానం చేయడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ వీడియో కర్ణాటక రాష్ట్రంలోని కూర్గ్ లోగల కాఫీతోటలో చిక్కింది. ఈ వీడియోలో పులి మొదట టబ్ వద్దకు వస్తుంది. టబ్ చుట్టూ తిరుగుతూ.. ఏదో పెద్ద డిటెక్టివ్ లాగా పరిశీలించి.. అనంతరం అందులోకి దిగి జలకాలాట ప్రారంభిస్తుంది. అంతా బాగానే ఉంది కానీ.. టబ్ లో నీటితో పాటు ఆ పక్కనే షోపు లేదా షాంపూ ఉంచితే పులి ఇంకా హప్యీగా ఫీల్ అయ్యేదేమో.!