English | Telugu
డీసీసీ అధ్యక్షుల ఎంపికపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్
Updated : Sep 23, 2025
తెలంగాణతో పాటు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో డీసీసీ అధ్యక్షుల నియామకానికి కాంగ్రెస్ అధిష్ఠానం పరిశీలకులను నియమించింది. తెలంగాణ కోసం 22 మంది పరిశీలకులను ప్రకటించింది. ఈ బాధ్యతలను సీనియర్ నేతలకు అప్పగించినట్టు ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. డీసీసీల నియామకాన్ని పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తున్నట్టు పీసీసీ వర్గాలు చెబుతున్నాయి. ఎలాంటి ఒత్తిళ్లకు తావులేకుండా నిష్పాక్షికంగా నిర్ణయాలు తీసుకునేలా సీనియర్ నాయకులను ఇన్‌ఛార్జ్‌లుగా నియమించారు. భవిష్యత్‌లో అధిక ప్రాధాన్యం కలిగే అవకాశం ఉన్నందున డీసీసీ పదవులపై డిమాండ్ పెరిగినట్లు సమాచారం.