English | Telugu
కరోనా ఎఫెక్ట్.. తెలంగాణలో ఏప్రిల్ 1 విడుదల
Updated : Mar 14, 2020
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొవిడ్ -19(కరోనా వైరస్) కేసులు దేశంలో చాపకిందనీరులా విస్తరిస్తున్న వేళ తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మహమ్మారినిఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలకు దిగింది.జనసందోహాలు లేకుండా చూడాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాల నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యా సంస్థలను ఈ నెల 31వరకు మూసివేయాలని నిర్ణయించింది. దీనిపై కేసీఆర్ ఉదయమే అసెంబ్లీలో ప్రకటన చేసారు. అనంతరం సీఎం కేసీఆర్ అధ్యక్షతనభేటీ అయిన ఉన్నతస్థాయి కమిటీ దేశంలో కరోనా ప్రభావం, పలు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపైచర్చించింది. అనంతరం రాష్ట్రంలో ఈ వైరస్ ప్రభావాన్ని కట్టడి చేయడమే లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.ఇప్పటిమే రాష్ట్రంలో జరుగుతున్న పరీక్షలను మాత్రం యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించారు. సినిమాథియేటర్లు, షాపింగ్ మాల్స్‌ను మూసివేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. అలాగే,శాసనసభ బడ్జెట్ సమావేశాలను సైతం కుదించాలని నిర్ణయం తీసుకున్నారు.వాస్తవానికి ఈ నెల 20 వరకు ఈ సమావేశాలు జరగాల్సి ఉన్నప్పటికీప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రేపు, ఎల్లుండి సమావేశాలు నిర్వహించి.. సోమవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చించి దానికి ఆమోదం తెలిపిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేయనున్నారు.