English | Telugu
58 నిమిషాల్లో 46 వంటకాలు.. పదేళ్ల బాలిక వరల్డ్ రికార్డ్
Updated : Dec 16, 2020
లాక్ డౌన్ సమయంలో తన తల్లి దగ్గర వంట నేర్చుకుందీ చిన్నారి. తన బిడ్డ లాక్ డౌన్ సమయంలో వంటలు వండటం నేర్చుకుందని లక్ష్మి తల్లి కలైమగల్ తెలిపారు. ఆమె వేగాన్ని, ప్రతిభను చూసిన తండ్రి వరల్డ్ రికార్డు కోసం కృషి చేయాలని ప్రోత్సహించారని చెప్పారు.
తనకు వరల్డ్ రికార్డు దక్కడంపై ఆనందాన్ని వ్యక్తం చేసిన లక్ష్మి.. తాను తన తల్లిని చూసి వంట పట్ల ఆసక్తి పెంచుకున్నానని తెలిపింది. తానిప్పుడు వివిధ రకాల తమిళ సంప్రదాయ వంటకాలను చేయగలనని చెప్పింది. వరల్డ్ రికార్డు సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని లక్ష్మి తెలిపింది. గతంలో కేరళకు చెందిన పదేళ్ల శాన్వి అనే బాలిక.. గంట వ్యవధిలో 30 రకాల వంటకాలు చేసి రికార్డు సృష్టించగా, ఇప్పుడు ఆ రికార్డును లక్ష్మి అధిగమించింది.