English | Telugu
టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్ కు హైకోర్టులో ఊరట
Updated : Jul 17, 2020
ఈ కేసు ఆధారంగా ఈడీ రంగంలో దిగింది. ఈడీ వర్గాలు ఎన్ ఫోర్స్ మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఈసీఐఆర్) నమోదు చేయడంతో, తను మళ్లీ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని భావించిన రవిప్రకాష్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం కొన్ని షరతులతో బెయిల్ ఇచ్చింది. రూ.లక్ష చొప్పున రెండు ష్యూరిటీలు సమర్పించాలని ఆదేశించింది. అంతేకాదు, ఈడీ అధికారులు ఎప్పుడు విచారణకు పిలిస్తే అప్పుడు హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈడీ విచారణ కొనసాగించుకోవచ్చని హైకోర్టు తెలిపింది.